టిఎస్ఆర్టీసి ఎంప్లాయిస్ యూనియన్ గ్రేటర్ హైదరాబాద్ సిటీ జోనల్ కార్యదర్శిగా వినాయకరెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ స్టేట్ ఆర్టీసి ఎంప్లాయిస్ యూనియన్ గ్రేటర్ హైదరాబాద్ సిటీ జోనల్ సెక్రటరీగా మదీనగూడ నివాసి ఈమని వినాయకరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ సిటీ జోనల్ మహాసభలో ఎం.వెంకట్ గౌడ్ అధ్యక్షతన నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

  • నూతన కమిటీ వివరాలు ..

గ్రేటర్ హైదరాబాద్ సిటీ జోనల్ కమిటి అధ్యక్షులుగా ఎం.ఎ.మజీద్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్.శరణప్ప, కార్యదర్శిగా ఈమని వినాయకరెడ్డి, కోశాధికారిగా కంది రవీందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయిన టిఎస్ ఆర్టీసి ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి ఆర్టీసి, ఆర్టీసి కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రసంగించారు. ఈ మహాసభల్లో ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు బి.పాపయ్యగౌడ్, సి.హెచ్.బాపురెడ్డి, డి.గోపాల్, బి.జ్యోతి, నగేష్ పటేల్, టి.ఎస్.రెడ్డి, ఏ.ఎస్.రెడ్డి, బి.వెంకటయ్యలతో పాటు ఇరవై ఐదు డిపోల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here