చందానగర్ సర్కిల్ లో జోరుగా నామినేషన్ లు

నాలుగు డివిజన్ లకు మొత్తంగా 50 మంది అభ్యర్థులు.. 76 నామినేషన్లు 

నామినేషన్ దాఖలు చేస్తున్న నిర్మల రఘుపతి రెడ్డి
నామినేషన్ దాఖలు చేస్తున్న బొబ్బ నవతరెడ్డి

చందానగర్(శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ ల పర్వం ముగిసింది. తొలి రెండు రోజులు నామినేషన్లు మందకొడిగా సాగినా చివరి రోజు జోరందుకున్నాయి. సర్కిల్ పరిధిలోని హఫీజ్ పేట్, మాదాపూర్, మియాపూర్, చందానగర్ డివిజన్లకు గానూ మొత్తంగా 50 మంది అభ్యర్థులు 76 నామినేషన్ లు దాఖలు చేశారు. చివరి రోజు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

నామినేషన్ దాఖలు చేస్తున్న అనూష మహేష్ యాదవ్
నామినేషన్ దాఖలు చేస్తున్న పూజిత జగదీశ్వర్ గౌడ్

మాదాపూర్ (107) డివిజన్ లో…
టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ నామినేషన్ దాఖలు చేయగా, బీజేపీ తరపున గంగల రాధాకృష్ణ యాదవ్, పొల్లా కృష్ణ వినయ్ బాబు, గంగల జంగయ్య యాదవ్ లు నామినేషన్ వేశారు. టిడిపి నుండి ఆరెపల్లి సాంబశివరావు, తన్నీరు ప్రసాద్ లు, కాంగ్రెస్ పార్టీ నుండి డి.నగేష్, డి.సురేష్ లు, స్వతంత్ర అభ్యర్థులుగా సాయి శంకర్ యాదవ్, షేక్ వహీద్ లు నామినేషన్ లు దాఖలు చేశారు. మొత్తంగా ఈ డివిజన్ నుండి రెండవ రోజు 7 మంది అభ్యర్థులు 12 నామినేషన్ లు రాగా మొత్తంగా 10 మంది అభ్యర్థులు 16 నామినేషన్ లు దాఖలు చేశారు.

నామినేషన్ దాఖలు చేస్తున్న జగదీశ్వర్ గౌడ్
నామినేషన్ దాఖలు చేస్తున్న కసిరెడ్డి సింధు రెడ్డి

మియాపూర్ (108) డివిజన్ లో…
మియాపూర్ డివిజన్ నుండి బిజెపి పార్టీ తరపున కలివేముల మనోహర్, మన్నేపల్లి సాంబశివ రావ్, డిఎస్ఆర్ కే ప్రసాద్, కే.రాఘవేందర్ రావు, సమ్మెట ప్రసాద్, కే.సత్యనారాయణ లు, టిఆర్ఎస్ పార్టీ తరపున ఉప్పలపాటి శ్రీకాంత్ నామినేషన్ దాఖలు చేయగా, రెబెల్ అభ్యర్థులుగా టి.సంతోష్ రెడ్డి, తెనాలి సుమలత లు నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఇలియాజ్ షరీఫ్, టిడిపి పార్టీ నుండి రావిపాటి వెంకటేశ్వర్లు, ఎసిపిఐ యు పార్టీ నుండి కే.శ్రీనివాస్ లు నామినేషన్ దాఖలు చేశారు. రెండవ రోజు డివిజన్ నుండి 12 మంది అభ్యర్థులు 13 నామినేషన్లు రాగా మొత్తంగా 16 మంది అభ్యర్థులు 22 నామినేషన్ లు దాఖలు చేశారు.

నామినేషన్ దాఖలు చేస్తున్న ఉప్పలపాటి శ్రీకాంత్
నామినేషన్ దాఖలు చేస్తున్న కే.రాఘవేందర్ రావు

హఫీజ్ పేట్ (109) డివిజన్ లో…
హఫీజ్ పేట్ డివిజన్ నుండి టిఆర్ఎస్ పార్టీ తరపున వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ నామినేషన్ దాఖలు చేయగా, రెబెల్ అభ్యర్థులుగా ఏ.రాణి రెడ్డి లు నామినేషన్ లు వేశారు. బిజెపి పార్టీ తరపున బోయిన అనూష యాదవ్, ఏశం మానస, మన్నేపల్లి లక్ష్మిలు నామినేషన్లు సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ నుండి జె.రేణుక, టిడిపి నుండి కుర్ర ధనలక్ష్మి నామినేషన్ వేయగా, మజ్లీస్ పార్టీ నుండి షీమా, సఫియా బేగంలు, ఎంసిపిఐ యు పార్టీ నుండి సుల్తానా బేగం, స్వతంత్ర అభ్యర్థి గా ఎం. లక్ష్మి నామినేషన్ లు సమర్పించారు. కాగా ఈ డివిజన్ నుండి రెండవ రోజు 11 మంది అభ్యర్థులు 16 నామినేషన్లు రాగా మొత్తంగా 11 మంది అభ్యర్థులు 18 నామినేషన్ లు దాఖలు చేసారు.

నామినేషన్ దాఖలు చేస్తున్న సురేష్
నామినేషన్ దాఖలు చేస్తున్న గంగల రాధాకృష్ణ యాదవ్

చందానగర్ (110) డివిజన్ లో…
బిజెపి నుండి కసిరెడ్డి సింధు రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్.మంజుల రఘునాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా రెబెల్ అభ్యర్థులు గా బొబ్బ నవతా రెడ్డి, మిరియాల యామిని దివ్య, కట్ల నిర్మల లు నామినేషన్లు దాఖలు చేయగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా అక్సారి బేగం, టిడిపి అభ్యర్థి గా మౌనిక జెల్ల, జెఎస్ పి నుండి దాసరి శ్రీదేవి, ఎంసిపిఐయూ నుండి పుష్ప అంగడి, స్వతంత్ర అభ్యర్థులు గా సునీత ప్రభాకర్ రెడ్డి, పద్మావతి లు నామినేషన్ లు దాఖలు చేశారు. రెండవ రోజు ఈ డివిజన్ నుండి రెండవ రోజు 11 మంది అభ్యర్థులు 17 మొత్తంగా 13 మంది అభ్యర్థులు 20 నామినేషన్లు దాఖలు చేశారు.

నామినేషన్ దాఖలు చేస్తున్న కలివేముల మనోహర్
నామినేషన్ దాఖలు చేస్తున్న సునీత ప్రభాకర్ రెడ్డి
నామినేషన్ దాఖలు చేస్తున్న మానస శ్రీశైలం యాదవ్
నామినేషన్ దాఖలు చేస్తున్న లక్ష్మి మల్లేష్
Advertisement

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here