భారతీ నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): భారతీ నగర్ డివిజన్ తెరాస రెబల్ కార్పొరేటర్ అభ్యర్థిగా జి.లతాశ్రీ మోహన్ గౌడ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. డివిజన్లో ప్రజల ఆదరణ తమకు ఉందని, ఎన్నికల్లో తమను గెలిపిస్తారన్న నమ్మకం ఉందని, అందుకనే నామినేషన్ వేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకుడు మోహన్ గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.