కాసాని జ్ఞానేశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ కి కానుకగా ఇస్తాం

  • ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ఆరెక పూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించి, కేసీఆర్ కు కానుకగా ఇస్తామని ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ఆరెక పూడి గాంధీ తెలిపారు. మియాపూర్ డివిజన్ పరిధి నరేన్ గార్డెన్స్ లో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆద్వర్యంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి , ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ దాయనంద్ గుప్తా, చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్, జూపల్లి సత్యనారాయణ, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి, మాధవరం రోజాదేవి రంగారావు, మాజీ కార్పొరేటర్ సాయి బాబా, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మొవ్వ సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రసంగించారు.

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గాంధీ

ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ని భారీ మెజారిటీ తో గెలిపించాలని, అందరం కలిసి కట్టుగా సమిష్టి కృషితో పని చేసి అఖండ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ కి కానుకగా ఇద్దామని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యేగా గాంధీని భారీ మెజారిటీతో గెలిపించిన విధంగా అదే స్ఫూర్తి, పట్టుదలతో కాసాని జ్ఞానేశ్వర్ ని గెలిపించాలని తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుందని, ఈ సారి కూడా పార్టీ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్ కి కానుకగా ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటుందని, కేసీఆర్ ని ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. ఏప్రిల్ 13వ తేదీన జరిగే చేవెళ్ల పార్లమెంట్ మీటింగ్ కు ప్రతి ఒక్కరు తరలి రావాలనీ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here