- హరితహారంలో అందరం పాల్గొందాం: గంధం రాములు ప్రైవేటు ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు
నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా జీఐసీ ఫౌండర్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ పిలుపు మేరకు చేవెళ్ల మొయినాబాద్ మండలం వెంకపల్లి క్యాంప్ కార్యాలయంలో ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి సీతా రంజిత్ రెడ్డి, రంజిత్ రెడ్డి మిత్రులు తిరుపతి రెడ్డితో కలిసి మొక్కలు నాటారు.
వారిలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు భారత ప్రైవేటు ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు, ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు వారి మిత్రబృందం ఉన్నారు. కార్యక్రమంలో పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోల శ్రీనివాస్, కార్యదర్శి వేముల భాస్కర్, సంపత్ కుమార్, మోహన్ నాయక్, ప్రైవేట్ టీచర్స్ విభాగం అధ్యక్షులు అజయ్ కార్తీక్, ఉపాధ్యక్షులు జార్జ్ పాల్, రంగా రెడ్డి జిల్లా అద్యక్షులు జనార్ధన్, రాఘవేందర్ రెడ్డి , సుభాష్ పాల్గొన్నారు.