మొబైల్ వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ల‌తో టీకా ప్ర‌జ‌ల‌కు సుల‌భంగా అందుతుంది: ప్ర‌భుత్వ విప్ గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని సర్కిల్ కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ ను ప్ర‌భుత్వ విప్ గాంధీ కార్పొరేట‌ర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, రోజాదేవి రంగరావు, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ ల‌తో కలిసి ముఖ్యఅతిథిగా హాజ‌రై ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రాంత ప్రజలంద‌రికీ సకాలంలో టీకా అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. మొబైల్ వ్యాక్సినేషన్ ద్వారా ప్ర‌జ‌ల‌కు మరింత సులువుగా అందుతుంద‌ని తెలిపారు. కరోన మహమ్మారి ని ఎదుర్కోవడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని ఇందులో భాగంగా ఇంటింటి జ్వర సర్వే నిర్వహించి వివరాలను సేకరించి పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జ‌రిగింద‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఒ సృజన, డాక్టర్ వినయ్, ఎఎమ్ఒహెచ్ కార్తీక్‌, మాజీ కార్పొరేటర్ రంగరావు, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు జిల్లా గణేష్ , తెరాస నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, సైదేశ్వర్ , గురు చరణ్ దుబే,కాజా తదితరులు పాల్గొన్నారు.

చందాన‌గ‌ర్ స‌ర్కిల్ కార్యాల‌యం వ‌ద్ద మొబైల్ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మ ప్రారంభోత్స‌వంలో ప్ర‌భుత్వ విప్ గాంధీ, కార్పొరేట‌ర్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here