గోపన్‌ పల్లి తండా లో మొబైల్ వాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించిన కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం ప‌రిధిలోని గచ్చిబౌలి డివిజన్ గోపనపల్లి తండా లో గల ప్రైమరీ పాఠశాల వద్ద జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మొబైల్ వాక్సినేషన్ సెంటర్ ను సోమ‌వారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక నాయకులు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాక్సిన్ తప్పని సరిగా వేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం రాని వారికి మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్ర‌తిరోజూ ఉదయం 9 గంటల నుంచి ఒక్కో మొబైల్‌ సెంటర్‌ ద్వారా రోజుకి 150 నుంచి 200 మందికి వ్యాక్సిన్ వేస్తారని తెలిపారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ సెంటర్ల ద్వారా సేవ‌లు అంద‌జేస్తార‌ని, వ్యాక్సిన్ కోసం ఎక్కువ సేపు లైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఆధార్ వివరాలు తెలిపి వాక్సిన్ వేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇనస్పెక్టర్ జలెందర్ రెడ్డి , రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, జి.హెచ్.ఎం.సి శానిటేషన్ సూపర్వైజర్ రాందాస్ సీనియర్ నాయకులు వెంకటేష్ , శ్రీశైలం, ప్రభాకర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

మొబైల్ వ్యాక్సినేష‌న్ సెంట‌ర్లో వ్యాక్సినేష‌న్ ప్రక్రియ‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here