మియాపూర్ మ‌యూరిన‌గ‌ర్‌లో మొబైల్ వ్యాక్సినేష‌న్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్ర‌భుత్వ విప్ గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరినగర్ అసోసియేషన్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ ను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు , రోజాదేవి రంగరావు ల‌తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ప్ర‌భుత్వం అంద‌జేస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సద్వినియోగపర్చుకోవలని గాంధీ సూచించారు .ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగరావు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు జిల్లా గణేష్ , తెరాస నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, ప్రతాప్ రెడ్డి, కిషోర్ విద్యాసాగర్, సైదేశ్వర్ , చంద్రికప్రసాద్,కాజా తదితరులు పాల్గొన్నారు.

మొబైల్ వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ ప్రారంభోత్స‌వంలో ప్ర‌భుత్వ విప్ గాంధీ, కార్పొరేట‌ర్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here