నమస్తే శేరిలింగంపల్లి: సాయిరాం కాలనీలో నెలకొన్న పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, దశలవారీగా కాలనీని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ స్థానికులకు హామీ ఇచ్చారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని సాయిరాం కాలనీలోని పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో కాలనీవాసులు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన డ్రైనేజీ, రోడ్డు పనులు త్వరలోనే పూర్తి చేస్తామని, సాయిరాం కాలనీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, కాలనీవాసులు పాండు ముదిరాజు, బాబు గౌడ్, వెంకటేష్, జితేందర్, మల్లేష్ గౌడ్, కాలనీవాసులు పాల్గొన్నారు.