సీఎం రిలీఫ్ ఫండ్ స‌హాయం అంద‌జేత

శేరిలింగంప‌ల్లి, మార్చి 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మసీద్ బండలో సీనియర్ నాయకుడు మారబోయిన అనిల్ కూమర్ యాదవ్ ప‌లువురికి త‌న ఆఫీస్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య స‌హాయం అందించడానికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత‌గానో దోహ‌దం చేస్తుంద‌ని అన్నారు. 2 ఏళ్ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 3,76,373 మంది లబ్ధిదారులకు రూ.1,685.79 కోట్ల సహాయం అందించార‌ని అన్నారు. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు వైద్య స‌హాయం కోసం ఈ నిధి ప‌నిచేస్తుంద‌ని, ఆర్థికంగా వెనుక‌బ‌డిన కుటుంబాల‌కు స‌హాయం అందించ‌డం జ‌రుగుతుంద‌ని అన్నారు. ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ వేరుగా ప‌నిచేస్తుంద‌ని, వార్షిక కుటుంబ ఆదాయం రూ.1.60 ల‌క్ష‌ల‌కు లోపు ఉన్న‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here