శేరిలింగంపల్లి, మార్చి 14 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ హుడా ట్రేడ్ సెంటర్ లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో బ్రహ్మశ్రీ కన్నేపల్లి శివరామ చంద్రమూర్తి గురువు స్వయం పర్యవేక్షణలో పండితులచే అత్యంత వైభవంగా రాజగోపుర శిఖర ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించారు. పిఏసీ ఛైర్మెన్, శేరిలింగంపల్లి శాసనసభ్యుడు ఆరెకపూడి గాంధీతో కలిసి శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ వేదపండితుల వేదఘోషల మధ్య ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంలో నిండిపోయిందని అన్నారు. భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకుని భక్తిశ్రద్ధలతో శ్రీరాముని ఆశీస్సులు పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానికవాసులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






