శేరిలింగంపల్లి, మార్చి 13 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ హుడా ట్రేడ్ సెంటర్ లోని శ్రీశ్రీశ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో బ్రహ్మశ్రీ కన్నేపల్లి శివరామచంద్రమూర్తి పర్యవేక్షణలో నిర్వహించిన శ్రీరామ తారక పంచాయతన దేవతా యజ్ఞ అష్టోత్తర మహా కలశ మహా కుంభాభిషేకంలో భాగంగా ప్రత్యేక పూజలలో శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేష్, రవి యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






