నమస్తే శేరిలింగంపల్లి : ఆల్విన్ కాలనీ డివిజన్ బాధ్యత తనదని, కూత వేటు దూరంలో తన ఇల్లుంది.. ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ నాయకులు, కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ నివాసంలో ఆత్మీయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఆల్విన్ కాలనీ డివిజన్ ప్రజలను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, ఆల్విన్ కాలనీ డివిజన్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, కార్పొరేటర్ పోయినంత మాత్రాన ఒరిగేది ఏమి లేదని, ఆయన స్వార్థం కోసం, కుటుంబం స్వార్థం కోసం, స్వలాభం కోసమే పార్టీ మారాడే తప్ప మరొకటి లేదని పెద్దగా పట్టించుకోవాల్సి న అవసరం లేదన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ లో 90 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పి ఏ ఉద్దేశ్యం తో పార్టీ మారాడో ఆల్విన్ కాలనీ డివిజన్ ప్రజలందరికీ తెలుసునని, ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు.
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ధరణి నగర్ ముంపు సమస్య ను శాశ్వతంగా పరిష్కరించనాని , ఒకప్పుడు వాన వస్తే ధరణినగర్ మునిగి పోయేదని, ప్రధాన పత్రికలలో ప్రధాన అంశం ధరణి నగర్ వరద పైనే వార్తలు వచ్చేవని, ఇప్పుడా పరిస్థితి లేకుండా చేసామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.