- శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్ చార్జి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మాదాపూర్ లోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్ వద్ద ఇఫ్తార్ విందు
- పాల్గొన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ శాఖల ప్రధాన సలహాదారులు జనాబ్ ముహమ్మద్ అలీ షబ్బీర్, చేవెళ్ల ఎంపీ డాక్టర్.జి.రంజిత్‌రెడ్డి, ఎంబీసి డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జేరిపాటి జైపాల్
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని మాదాపూర్ డివిజన్ ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్ వద్ద ఇఫ్తార్ విందు నిర్వహించారు. ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ శాఖల ప్రధాన సలహాదారులు జనాబ్ ముహమ్మద్ అలీ షబ్బీర్, చేవెళ్ల ఎంపీ డాక్టర్.జి.రంజిత్‌రెడ్డి, ఎంబీసి డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జేరిపాటి జైపాల్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఖర్జూరా పండ్లను తినిపించి ఉపవాస దీక్షలను విరమింపజేశారు. అనంతరం నేతలంతా కలిసి సహపంక్తిగా వారితో కలిసి భోజనం స్వీకరించారు. ఈ సంధర్బంగా ముఖ్యఅతిథులు మాట్లాడుతూ.. 40 రోజుల పాటు అతి పవిత్రమైన ఉపవాస దీక్షలతో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు చేసి ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసుకోడం అభినందనీయమన్నారు.
ఇఫ్తార్ విందుల ఏర్పాటు వల్ల మత సామరస్యం పెంపొందడంతో పాటు దైవ చింతన, ప్రార్ధనల పట్ల ఆసక్తి కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.