- ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని కలిసి వినతిపత్రం అందించిన అంబేద్కర్ నగర్ కాలనీవాసులు
నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీవాసులు పలు సమస్యలు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ధాత్రి నాథ్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. కాలనీలో శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని, కాలనీలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్, కరెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు విన్నవించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ అంబేద్కర్ నగర్ కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన శ్మశాన వాటికను త్వరలోనే అభివృద్ధి చేస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ అంతరాయం కలుగకుండా ట్రాన్స్ ఫార్మర్లు, అవసరమున్న చోట విద్యుత్ స్థంబాలు ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధాత్రి నాథ్ గౌడ్, అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు నాగరాజు, గోపాల్, కేశవ్, బాబీ, సీతారాం పాల్గొన్నారు.