నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోని ఇందిరా నగర్ లో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్డు పనులను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యవేక్షించారు. అనంతరం కార్పొరేటర్ ని స్థానిక నాయకులు శాలువాతో సత్కరించారు. పాదయాత్రల ద్వారా ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు జవాబుదారీగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఆయా సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ..డివిజన్ లోని బస్తీలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పటికే దాదాపుగా పూర్తవ్వగా మిగిలిన బస్తీలలో అధునాతన సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. స్థానిక వాసులకు ఇబ్బంది కలగకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, ఆఫ్జల్, సయ్యద్ నయీమ్, గోపాల్ యాదవ్, షఫీక్ అహ్మద్, రాజన్, వెంకటేష్, ప్రసాద్, నరేష్, ముకేష్ సింగ్, వేణు, నారాయణ, రామి రెడ్డి, నర్సింగ్ రావు, సుబ్రహ్మణ్యేశ్వర రావు, నీరజ రాణి, రెడ్డి, సింగ్, రామ్, సత్తర్, రమేష్, కశిం, నదీమ్ పాల్గొన్నారు.