నమస్తే శేరిలింగంపల్లి : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని పలువురు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి బొకే అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

శుభాకాంక్షలు తెలిపిన వారిలో తార నగర్ లోని కూరగాయల మార్కెట్ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, వైస్ ప్రెసిడెంట్ షేక్ కాజ పాషా ఇతర సభ్యులు ఉన్నారు.





