నమస్తే శేరిలింగంపల్లి : ముస్లింల పవిత్ర పండుగల బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ ఈద్ ముబారక్ తెలిపారు. త్యాగం, భక్తి విశ్వాసాలకు ప్రతీక బక్రీద్ పర్వదినం అన్నారు. త్యాగనిరతితోపాటు మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలను కూడా విడిచిపెట్టి మానవతను వెదజల్లాలన్నదే బక్రీద్ పండుగలోని ప్రధాన పరమార్ధం అని అన్నారు.
బక్రీద్ సందర్భంగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నేతాజీ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎండీ కమల్ పాషా ఆహ్వానం మేరకు బక్రీద్ పండుగ వేడుకల్లో పాల్గొన్న నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేట్ కాలనీ అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్ కి వారి కుటుంబ సభ్యులకు బక్రీద్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, మక్బూల్ మహ్మద్, చాంద్ పాషా, కుటుంబ సభ్యులు, నేతాజీ నగర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.