- శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ విన్నపం మేరకు సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్నామని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రంగారెడ్డి జిల్లా ఇంచార్జి, ఐటీ, పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుని మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాలలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను మంత్రి వివరించారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించి, తొందర్లోనే సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.

నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత జిల్లా మంత్రి పర్యవేక్షణలో నిధులు మంజూరు చేస్తామని, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్ లను సమన్వయ పరుస్తూ ముందుకు సాగుతామని మంత్రి తెలిపారు