శ్రీరాముడి మందిరానికి కృష్ణ భక్తుడు రూ.1 లక్ష నిధి సమర్పణ

మియాపూర్‌(న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అయోధ్య‌లో నిర్మిత‌మ‌వుతున్న భ‌వ్య రామ మందిరానికి ఓ కృష్ణ భ‌క్తుడు రూ.1 ల‌క్ష నిధి స‌మ‌ర్ప‌ణ చేశారు. మదీనగూడ లాండ్ మార్క్ రెసిడెన్సిలో నివాసముండే అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్‌) భక్తుడు, సూర్యారావు శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కి రూ.1లక్ష నిధి సమర్పణ చేశారు. ఆ మొత్తం చెక్కును ఆర్ఎస్ఎస్ కూకట్ పల్లి జిల్లా సంపర్క్ ప్రముఖ్ రమణారెడ్డి, లక్ష్మీ విహార్ ఫేజ్ 2 అధ్యక్షులు కరుణాకర్ ల‌కు అందజేశారు. రామకార్యంలో భాగస్వాములైన సూర్యారావు కు శ్రీ రామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర‌ జ‌గ‌జాగ‌ర‌ణ సభ్యులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

నిధి స‌మ‌ర్ప‌ణ చెక్కును ర‌మ‌ణారెడ్డికి అంద‌జేస్తున్న సూర్యారావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here