సబ్ స్టేషన్ నిర్మాణానికి కృషి చేస్తాం : ఎమ్మెల్యే గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సాయి వైభవ్ కాలనీ, సాయి ఐశ్వర్య కాలనీల లో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై మాజీ కార్పొరేటర్ సాయి బాబా, జీహెచ్ ఎంసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాదయాత్ర చేసి, పరిశీలించారు.

సాయి వైభవ్ కాలనీ, సాయి ఐశ్వర్య కాలనీల లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే గాంధీ

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ సంతులిత, సమగ్ర అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని, దశల వారిగా అభివృద్ధి పనులు చేపడుతామని, అసంపూర్తి గా మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని, కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ వాసులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ,సమస్యలను పరిగణలోకి తీసుకోని , వారి విజ్ఞప్తి మేరకు కాలనీ లలో స్వయంగా ఇంటిటికి తిరుగుతూ సమస్యలు తెలుసుకొని సత్వర పరిష్కారమే గా ధ్యేయంగా పనిచేస్తామని ,ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తుల ను పరిగణలోకి తీసుకొని త్వరితగతిన సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు.

ప్రజల సమస్యలు తెలుసుకుంటూ…

సాయి ఐశ్వర్య , సాయి వైభవ్ కాలనీ , జైన్ అపార్ట్మెంట్స్ చుట్టుపక్కల కాలనీలలో విద్యుత్ అంతరాయం సమస్య తీవ్రంగా ఉందని దీనిని నివారించడానికి ఒక సబ్ స్టేషన్ కావాలని కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టి కి తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గాంధీ విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరం మెరుగైన విద్యుత్ సరఫరా అందించుట కోసం అవసరమైన సబ్ స్టేషన్ నిర్మాణం కోసం కృషి చేస్తానని, త్వరలోనే సబ్ స్టేషన్ నిర్మాణం చేపడుతామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ ఎం సి అధికారులు ఈఈ శ్రీనివాస్, డీ ఈ రమేష్, డిఈ విశాలాక్షి, ఏ ఈ జగదీష్, ఎలక్ట్రికల్ డీ ఈ గోపాల్ కృష్ణ , ఏఈ వేణు గోపాల్, ఏఎం హెచ్ఓ నగేష్ నాయక్ మరియు గ్రంథలాయ డెరైక్టర్ గణేష్ ముదిరాజు, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు. చెన్నం రాజు, రాగం జంగయ్య యాదవ్, నరేష్, రాజు ముదిరాజ్,రమేష్ గౌడ్, గోవింద్, నారాయణ, కాలనీల వాసులు పద్మావతి, సత్యనారాయణ, రాజు, శ్రీనివాస్, భాగ్య ,కిరణ్, మల్లికార్జున్, భాస్కర్, చౌదరి, సురేందర్ , కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here