- కొద్ది రోజులుగా మంజీరా నీరు కలుషితమై సరఫరా.. ఇబ్బందుల్లో రైల్ విహార్ కాలనీవాసులు
- తక్షణమే స్పందించి మంజీరా నీటి పైపులైన్ పనులు ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోని రైల్ విహార్ కాలనీలో మంజీరా నీరు కలుషితమై సరఫరా అవుతుండడంతో కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు. ఈ విషయం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దృష్టికి రావడంతో ఆయన తక్షణమే స్పందించి సంబంధిత వాటర్ వర్క్స్ శాఖ అధికారులతో మాట్లాడి నూతన మంజీరా నీటి సరఫరా పైప్ లైన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ను కాలనీవాసులు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ ఇంటింటికి నల్లా కనెక్షన్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. రైల్ విహార్ కాలనీను మోడర్న్ కాలనీగా తీర్చిదిద్దుతానని అన్నారు. డివిజన్ లో ఎక్కడ తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఏ చిన్న సమస్య అయినా తన దృష్టికి వస్తే తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, సెక్రటరీ హరీష్ బాబు, ట్రెజరర్ శ్రీనివాస్ నాయక్, ముత్తుస్వామి, బాబురావు, మని, బలరాం, గోపాల్ యాదవ్ కాలనీవాసులు పాల్గొన్నారు.