- సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నెహ్రూనగర్ రోడ్డు నంబర్ 3 సమస్యకు పరిష్కారం లభించింది. రెండు రోజుల క్రితం కాలనీలో జరిగిన పాదయాత్రలో స్థానికులు రోడ్డు సమస్యను తెలిపారు. దీంతో నెహ్రూనగర్ రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్ తో కలిసి డివిజన్ ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్ ఈ సమస్యను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే కాలనీలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కార్యక్రమం లో డివిజన్ ఉపాధ్యక్షులు పద్మారావు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రామ్మూర్తి, సుభాష్ గౌడ్, మస్తాన్, గఫ్ఫార్, సుభాష్, యాదయ్య, జగదీష్, మహేష్ ముదిరాజ్ ఉన్నారు.