శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తారానగర్ తుల్జాభవాని ఆలయ పాలకమండలి చైర్మన్ మల్లికార్జున శర్మను యువ నాయకుడు సంపత్ పాలకుర్తి ఆద్వర్యంలో స్థానిక యువత శనివారం ఘనంగా సన్మానించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో శేరిలింగంపల్లిలోని యువతకు మార్గదర్శిగా నిలబడిన మల్లికార్జున శర్మకు ఎట్టకేలకు నామినేటెడ్ పదవి లభించడం సంతోషకరమని సంపత్ కొనియాడారు. వారి నేతృత్వంలో దేవాలయం అభివృద్ధి జరుగుతుందని, అందుకు స్థానిక యువత అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజేపీ నాయకులు శివకుమార్ తో పాటు స్థానిక యూత్ సభ్యులు కిరణ్, సాయిమురళి, సందీప్ కుమార్, మాధవ్ రెడ్డి, వినోద్ చౌదరి, ప్రవీణ్, శరత్ పట్వారి, లక్ష్మీకాంత్, వినోద్, పృథ్వి, శివ తధితరులు పాల్గొన్నారు.