శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని చాకలి చెరువు సుందరీకరణ పనులను డిప్యూటీ కమిషనర్ వెంకన్న, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ లతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ చాకలి చెరువుకు మహర్దశ పట్టిందని అన్నారు. చెరువులోని గుర్రపు డెక్కను పూర్తి స్థాయిలో తొలగించి ఆహ్లాదకరమైన వాతవరణం కల్పిస్తామని అన్నారు. స్థానికులు దోమలు, మురుగువాసన అని పలుమార్లు తన దృష్టికి తీసుకురాగా వారి కోరిక మేరకు సుందరీకరణ పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఎంవోహెచ్ రంజిత్, డివిజన్ తెరాస అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, తెరాస నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, పద్మారావు, కొండల్ రెడ్డి, పొడుగు రాంబాబు, చింతకింది రవి కృష్ణ యాదవ్, దేవులపల్లి శ్రీను, శ్రీనివాస్, నటరాజు, వేణుగోపాల్ రెడ్డి, రమేష్, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.