గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల నవోదయ కాలనీలో పలు సమస్యలు, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో స్థానిక కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ శ్రీనివాస్, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, డివిజన్ తెరాస అధ్యక్షుడు రాజు నాయక్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్, వాలా హరీష్, వార్డ్ మెంబర్ నరేష్, సత్యనారాయణ, కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రకాష్, వైస్ ప్రెసిడెంట్లు రాజయ్య, రహమాన్, జనరల్ సెక్రటరీ ఎండీ ముక్తార్ అహ్మద్, జాయింట్ సెక్రెటరీలు వెంకట్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, ట్రెజరర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.