నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను మార్చుకోవాలని ఏఐకెఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వాసుల మట్టయ్య, మైదాన ప్రాంత గిరిజన సంఘ రాష్ట్ర కన్వీనర్ వి. తుకారాం నాయక్ అన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కమిటీ పిలుపు మేరకు మఖ్దుం భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో 31న నిర్వహించే రాష్ట్ర స్థాయి సదస్సు కు సంభందించిన పోస్టర్ విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వామి నాధన్ కమిషన్ సిఫార్సులను చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, రైతు పంట ఉత్పత్తి కి 50%అదనపు మద్దతు ధర అందజేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.
రైతుల ఆత్మహత్యల నివారణకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. రుణ విముక్తి చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతు ప్రతినిధులతో చర్చించకుండా విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంట్ లో ఆమోదానికి పెట్టడం సరైనది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకున్నప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. కౌలు రైతులకు రైతుల రైతంగానికి నెలకు 5,000 పింఛన్ అందించాలన్నారు. ఈ కార్య క్రమంలో అన్ని ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు.