శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ, గంగారం, మదీనాగూడ, ఇంద్రా రెడ్డి ఆల్విన్ కాలనీ, మురళీధర్ సొసైటీ, RTC కాలనీ, శాంతి నగర్, వినాయక నగర్, వైశాలి నగర్, మైత్రి నగర్ ఫేస్ 1, గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీ, శారదా నగర్, యూత్ కాలనీ, సాయి నగర్, మాధవ నగర్, జనప్రియ నగర్ ఫేస్ ఫేస్1, ఫేస్ 2 కాలనీలలో రూ. 8 కోట్ల 32 లక్షల 80 వేలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం,UGD అండర్ గ్రౌండ్ డ్రైనేజి పైప్ లైన్, వరద నీటి కాలువ నిర్మాణం పనులకు,కమ్యూనిటీ హల్ నిర్మాణం, ఓపెన్ జిమ్ ఏర్పాటు పనులకు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గం, కాలనీ ల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం సీసీ రోడ్ల నిర్మాణం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. కాలనీల వాసులకు ఉపశమనం లభించిందని, మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






