గుర్తు తెలియ‌ని మ‌హిళ మృత‌దేహం ల‌భ్యం

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 9 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): ఓ గుర్తు తెలియ‌ని మ‌హిళ మృత‌దేహం మాదాపూర్ పోలీసుల‌కు ల‌భ్య‌మైంది. మాదాపూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. మాదాపూర్‌లోని ఖానామెట్ ఆర్చ్ వ‌ద్ద ఓ గుర్తు తెలియ‌ని మ‌హిళ మృత‌దేహం ప‌డి ఉంద‌ని స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మ‌హిళ మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతురాలి వ‌య‌స్సు సుమారుగా 50 నుంచి 60 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉంటుంద‌ని, ఆమె ఆనియ‌ర్ కల‌ర్ చీర‌, మెరూన్ క‌ల‌ర్ జాకెట్‌, గ్రే క‌ల‌ర్ హూడీ ధ‌రించి ఉంద‌ని, రెండు చేతుల‌కు గాజులు ఉన్నాయ‌ని, ఆమెను గుర్తు ప‌ట్టేందుకు ఆమె వ‌ద్ద ఇత‌ర ఎలాంటి ఆధారాలు ల‌భించ‌లేద‌ని పోలీసులు తెలిపారు. ఎవ‌రైనా గుర్తు ప‌ట్ట‌ద‌లిస్తే త‌మ‌ను సంప్ర‌దించాల‌ని పోలీసులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here