ఫిబ్రవరి 12న‌ జరిగే దేశవ్యాప్త సమ్మెను జ‌య‌ప్ర‌దం చేయాలి

శేరిలింగంపల్లి, ఫిబ్ర‌వ‌రి 10 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ఫిబ్రవరి 12న‌ జరిగే దేశవ్యాప్త సమ్మెలో జిహెచ్ఎంసి కార్మికులందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని జిహెచ్ఎంసి మియాపూర్ సర్కిల్ కమిషనర్ కి సమ్మె నోటీసు అంద‌జేశారు. కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, ఈఎస్ఐ , పిఎఫ్ సక్రమంగా అమలు చేయాలని, కార్మికులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని, ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికులకు రూ.25 లక్షలు ఇవ్వాలని, పనిచేస్తున్న క్రమంలో ప్రమాదం జరిగి గాయాలు అయితే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సిఐటియు కార్యదర్శి కొంగరి కృష్ణ , ఏఐటీయూసీ కార్యదర్శి చందు, శీను, ఏఐసిటియు దానయ్య, నారాయణ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here