నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం రూ.10లక్షలు అందించడం శుభపరిణామమని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, కంటెస్టడ్ ఎమ్మెల్యే వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన పథకాన్ని కొండాపూర్ ప్రభుత్వ దవాఖానలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోలికేరీ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.