నమస్తే శేరిలింగంపల్లి : ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్ మోహర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కాలనీల అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ తన పై నమ్మకంతో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ అండగా ఉంటానని, మరింత బాధ్యతగా శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.