శాంతినగర్‌లో డ్రై డే – ఫ్రైడే కార్యక్రమం.. దోమల నివారణపై ప్రజలకు అవగాహన

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సీజనల్ వ్యాధుల నియంత్రణ, దోమల వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో మదీనాగూడ సెక్షన్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో శుక్రవారం డ్రై డే – ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీలోని వివిధ వీధుల్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజలకు దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ సర్కిల్ AMHO డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ తనూజ, ఎంటమాలజిస్ట్, WEFA రాజేష్‌తో పాటు వారి బృంద సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, నీటి తొట్టెలను క్రమం తప్పకుండా శుభ్రపరచాలని సూచించారు. పనికిరాని వస్తువులు, పాత డబ్బాలు, ఇతర సామగ్రిలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నిల్వ నీటిలో దోమల లార్వా వృద్ధి చెందకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రజలకు వివరించారు. పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా నివారించవచ్చని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అశోక్, రాందాస్, హమీద్, వల్లెపు శేఖర్, అబ్దుల్లా, సాయి చరణ్ గౌడ్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here