శేరిలింగంపల్లి, నవంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ ఎన్‌క్లేవ్ కాలనీలో కొలువుదీరిన జగద్రక్షక శ్రీ ధర్మశాస్తా అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి ఆలయాన్ని సందర్శించిన ఆయన అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సత్యనారాయణ, శ్రీనివాస్, నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాగరాజు, నరేందర్ బల్ల, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






