కొండాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్ చిన్నకుమారుడు రాజ్‌కుమార్‌యాదవ్ ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం మసీద్‌బండలోని భిక్షపతియాదవ్ నివాసంలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12 గం.లకు వర్ధంతి కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిభిరాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమానికి హాజరవ్వాలని వారు కోరారు.