సంస్థాన్ నారాయ‌ణ పురంలో భ‌గీర‌థ మ‌హ‌ర్షి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: స‌గ‌రుల‌కు ఆద్యుడు భ‌గీర‌థ మ‌హర్షి విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని రాష్ర్ట స‌గ‌ర సంగం నాయ‌కులు ఆదివారం సంస్థాన్ నారాయ‌ణ పురంలో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా స‌గ‌ర సంఘం నాయ‌కులు ర్యాలీ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా స‌గ‌ర సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు ఉప్ప‌రి శేఖ‌ర్ సాగ‌ర్‌, గౌర‌వాధ్య‌క్షులు ముత్యాల హ‌రికిష‌న్ సాగ‌ర్‌, ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి స‌త్యం సాగ‌ర్‌, క‌ర్నె ప్ర‌భాక‌ర్‌లు హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్క సురేష్ సాగర్ , కోశాధికారి సందుపట్ల రాము సాగర్ , రాష్ట్ర ప్రచార కార్యదర్శి నేర్లకంటి రవి కుమార్ సాగర్‌, యాదాద్రి జిల్లా సంఘం అధ్యక్షులు నరసింహ సాగర్, నల్గొండ జిల్లా అధ్యక్షులు సందుపట్ల లక్ష్మణ్ సాగర్, ప్రధాన కార్యదర్శి ఆలేటి శివప్రసాద్ సాగర్ తో పాటు స‌గ‌ర నాయ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

భగీర‌థ మ‌హ‌ర్షి విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న ఉప్ప‌రి శేఖ‌ర్ సాగ‌ర్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here