శేరిలింగంపల్లి, డిసెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): అఖిల భారత యాదవ్ మహాసభ నేషనల్ సెక్రటరీ మహేందర్ యాదవ్ ఆహ్వానం మేరకు ఆయన నివాసంలో అల్పాహారం కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పాల్గొన్నారు. అల్పాహార విందు కార్యక్రమానికి హాజరైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్, బోయిన్ పల్లి కార్పొరేటర్ నరసింహ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీల సమస్యలు పరిష్కారానికి నోచుకొనేలా అసెంబ్లీలో చర్చించాలని కోరారు. యాదవ్, బీసీ యువత ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి రావాలని కోరారు. అనంతరం కరీంనగర్ జిల్లా యాదవ్, బీసీ సంఘాల నాయకులు పాల్గొని నవీన్ యాదవ్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ్ మహా సభ రాష్ట్ర కార్యదర్శి దొంతి బోయిన శ్రీనివాస్ యాదవ్, బీసీ నాయకులు అందెల కుమార్ యాదవ్, యాదవ, బీసీ సంఘాల నాయకులు, మహేందర్, యాదవ గేటెడ్ కమ్యూనిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






