శేరిలింగంపల్లి, డిసెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లు, దేవతల పట్ల ఎలా పడితే అలా మాట్లాడడం సరికాదని బిజెపి రాష్ట్ర నాయకుడు నీరటి చంద్రమోహన్ అన్నారు. తెలంగాణలో మత కల్లోలాలు చెలరేగే విధంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు సంవత్సరాలు హామీల వర్షం తప్ప ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిని మరల్చడం కోసం కొత్త నాటకాన్ని తెరపైకి తీసుకొచ్చాడని అన్నారు. మహిళలకు నెలకు రూ.2వేలు ఇస్తామని, విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పిన రేవంత్ ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసిన ఘనత వారి పార్టీకే దక్కుతుందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట కాలయాపన చేస్తూ పేద ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే విజయమని అన్నారు.






