బీసీలు రాజ్యాధికారం చేప‌ట్టాలి: బీసీ పొలిటికల్ ఫ్రంట్

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో చిక్కడపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కాసోజు శ్రీకాంతాచారి 16వ వర్ధంతి సందర్భంగా చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, వైస్ చైర్మన్ ఎస్ దుర్గయ్య గౌడ్, కన్వీనర్లు బైరు శేఖర్ గంగ‌పుత్ర, అంబాల నారాయణ గౌడ్, ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్, బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోయ గోపి ఘ‌న నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో కైలాస నేత, యాదగిరి యాదవ్ లపై కోమటిరెడ్డి బ్రదర్స్ చేసిన దౌర్జన్యాలపై కోటిన్నర మందితో పారుతున్న మూసీలో వారు మునిగి పాప ప్రక్షాళన‌ చేసుకోవాలని డిమాండ్ చేశారు. 46వ జీవో తెచ్చి స్థానిక సంస్థలకు బీసీలను దూరం చేసిన కాంగ్రెస్, పార్లమెంటులో బిల్లు పెట్టకుండా తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చకుండా వివక్ష చూపిస్తున్న బిజెపి, ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ లను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని వారు పిలుపునిచ్చారు. జనరల్ స్థానాల్లో అగ్రకులాలను ఓడించి బీసీలు కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మధుసుదనాచారి, నాగభూషణం , దామోదర్ గౌడ్, గడ్డమీద విజయ్ కుమార్ గౌడ్ , ప్రమీల, హర్షవర్ధన్ , సచిన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here