యువత బీఆర్ఎస్ లోకి రావాలి: మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ లో అల్లావుద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీనియర్ నాయకుడు మల్లారెడ్డి, సంగారెడ్డి రెడ్డితో కలిసి మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొండాపూర్ డివిజన్ BJYM వైస్ ప్రెసిడెంట్ కార్తీక్, ఆయ‌న‌ అనుచరులతో సుమారు 50 మంది బీఆర్ ఎస్ పార్టీ లో చేరిన సందర్భంగా వారిని అభినందిస్తున్నామ‌ని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ లో చేరటానికి యువత ముందుకు వస్తుందని, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నార‌ని, రాబోయే కాలంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగురవేస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చారి, రాము, అన్వర్, శివ, నాగ్ రాజ్, బాల్ రాజ్, సాయి, బాబు, శ్రీను, చిన్నా, పవన్, అనంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here