శేరిలింగంపల్లి, డిసెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంప్ రోడ్డు, టాకీ టౌన్ థియేటర్ నుండి మియాపూర్ విలేజ్ మసీదు వరకు, ప్రజయ్ షెల్టర్ అపార్ట్మెంట్స్ కాలనీలలో రూ.1 కోటి 77 లక్షల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, విభాగిని నిర్మాణం పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాలనీల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం పలు కాలనీలలో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, విభాగిని నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని అన్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, కాలనీ వాసులకు ఉపశమనం లభించిందని, మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని , శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అగ్రభాగాన నిలబెడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.






