శేరిలింగంపల్లి, డిసెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కి చందానగర్ నేషనల్ హైవే పై ఫుడ్ ఓవర్ బ్రిడ్జి కోసం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా TAC మెంబర్, రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు పోరెడ్డి బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ముంబై జాతీయ రహదారి చందానగర్ బస్టాండ్ సమీపంలో రోడ్డుకు ఇరువైపులా కాలేజీలు, హాస్పిటల్స్, బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, సూపర్ మార్కెట్లు, హోల్ సేల్ షాపులు, కూరగాయల మార్కెట్లు ఎన్నో ఉన్నాయని, కనుక వాటి అవసరాలకు ప్రజలు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్ రోడ్డుకు ఇరువైపులా వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని, కనుక ఈ విషయంపై వెంటనే స్పందించి ప్రజల సౌకర్యార్థం చందానగర్ బస్ స్టాప్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు ప్రకాశ్ రెడ్డి, మాజీ అధ్యక్షులు రాంరెడ్డి , వెంకటేష్ , వనం శ్రీనివాస్ గుప్తా , కృష్ణదాస్ , వేణుగోపాల్ గుప్తా , హరీష్ శంకర్ గౌడ్ , విజయ్ పాల్గొన్నారు.






