మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్‌గా మళ్లీ గెలిచినందుకు గాను యువత కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్‌ని సన్మానించారు. డివిజన్ పరిధిలోని ఇజ్జత్‌నగర్‌లో ఉన్న కార్పొరేటర్ కార్యాలయంలో ఆదివారం జగదీశ్వర్ గౌడ్‌ను యువత సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ఇజ్జత్‌నగర్ గ్రామంలోని సైబర్ కన్వెన్షన్ సెంటర్ వద్ద పొంగి పొర్లుతున్న యూజీడీని పరిశీలించారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.madhapurmadhapur


ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు గణేష్ యాదవ్, సతీష్ యాదవ్, సార్వార్, సుభాష్ నగర్ టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షుడు ముఖ్తర్, నాయకులు సత్యనారాయణ, రామకృష్ణ, దేవయ్య, నాయుడు, యువకులు సర్దార్, అఫ్సర్, ఆనంద్ సింగ్, మాజిద్, అహ్మద్, అరవింద్ సింగ్, అమీర్, ఖలీద్, రాము యాదవ్, అనిల్, ఆయుబ్, అస్లాం, దహుల్, లక్ష్మణ్, నరేష్ పాల్గొన్నారు.





