మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులను కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని అరబిందో కాలనీలో డ్రైనేజీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు కావల్సిన సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు.
