జ‌న‌ప్రియ వెస్ట్ సిటీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్‌

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని జనప్రియ వెస్ట్ సిటీ కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ ని ఆయ‌న కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దీనిపై ఉప్పలపాటి శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు.

కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్‌ను క‌లిసిన జ‌న‌ప్రియ వెస్ట్ సిటీ వాసులు

ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. మియాపూర్ డివిజన్ పరిధిలోని జనప్రియ వెస్ట్ సిటీ కాలనీ వాసులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, PAC ఛైర్మెన్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో కాలనీలో నెలకొన్న వివిధ సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తామని, కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన యూజీడీ పనులను, సీసీరోడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేస్తామని, మంజీర మంచినీటి వసతిని మెరుగుపరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మర్రపు గంగాధర్ రావు, జనప్రియ వెస్ట్ సిటీ కాలనీవాసులు ఇన్నారెడ్డి, సోమిరెడ్డి, ఇమ్మణీయులు, రామలింగం, ప్రదీప్, శ్రీనివాస్ రెడ్డి, శర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here