దుర్గం చెరువులో దూకి యువ వ్యాపారి మృతి

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దుర్గం చెరువులో దూకి ఓ యువకుడు మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడిని నల్లగండ్లలోని మిరో అపార్ట్‌మెంట్స్, బ్లాక్ బి లో నివాసం ఉంటున్న ఎ.సాయి మహేశ్వర్ (29)గా గుర్తించారు. అత‌ను వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అక్టోబ‌ర్ 31న సాయంత్రం సాయి మహేశ్వర్ దుర్గం చెరువులోకి దూకి మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై మృతుడి బంధువులు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని సమస్యల కారణంగా అత‌ను మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ విమల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల పూర్తి కారణాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here