శేరిలింగంపల్లి, నవంబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నేపథ్యంలో వివేకానంద నగర్ లోని సప్తగిరి కాలనీలో ఉన్న పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఇంటి వద్ద డీసీ కృష్ణయ్య, GHMC అధికారులు కలిసి ఆరెకపూడి గాంధీ వివరాలను అడిగి నమోదు చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ దేశ చరిత్రలో తొలి సారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర కుల గణన చేపట్టడం గొప్ప విషయమని అన్నారు. ప్రజలకు ఈ సర్వేకు సహకరించాలని కోరారు. దీని వల్ల పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుందని, కనుక ప్రజలు కచ్చితమైన సమాచారం ఇవ్వాలని కోరారు.