శేరిలింగంపల్లి, నవంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): నల్లగండ్ల ప్రధాన రహదారిలో క్రీమ్ స్టోన్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన JUICE – Hair, Beauty, Nails, Makeup లగ్జరీ సెలూన్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరుమాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్‌లతో కలిసి శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు సెలూన్‌ను లాంఛనంగా ప్రారంభించారు.

అనంతరం సెలూన్ నిర్వాహకులు అఖిల్, ఆశాలను ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అభినందించారు. ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, అంతర్జాతీయ స్థాయి బ్రాండ్లకు చెందిన లగ్జరీ సెలూన్లు అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు. అత్యాధునిక సౌకర్యాలు, నాణ్యమైన లగ్జరీ ఉత్పత్తులతో JUICE సెలూన్ స్థానిక ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్వాహకులు అఖిల్, ఆశాలకు వ్యాపారంలో మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకులు, కాలనీ వాసులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.





