శేరిలింగంపల్లి, మార్చి 28 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు సునీతా రావు పిలుపుమేరకు రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు జ్యోతి బీమ్ భరత ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గం అధ్యక్షురాలు చంద్రిక ప్రసాద్ ఆధ్వర్యంలో బ్లాక్ ఏ కమిటీ, 121 కూకట్ పల్లి ఆస్బెస్టాస్ కాలనీ డివిజన్, 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కమిటీలని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర మహిళ కాంగ్రెస్ సెక్రెటరీ రమాదేవి, అరుణ, ఏ బ్లాక్ ప్రెసిడెంట్ శ్రీదేవి, శేరిలింగంపల్లి వైస్ ప్రెసిడెంట్ తన్వీర్, జనరల్ సెక్రెటరీ కృష్ణకుమారి, సెక్రెటరీ వల్లి, ఏ బ్లాక్ అధ్యక్షరాలు శ్రీదేవి, కూకట్ పల్లి అధ్యక్షురాలు జ్యోతి, ఆల్విన్ కాలనీ అధ్యక్షురాలు రాజ్యలక్ష్మితో కలిసి కమిటీలకు నియామక పత్రాలు సభ్యులకు అందజేశారు.






