శేరిలింగంపల్లి, మార్చి 28 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితోనే క్రీడలకు ప్రోత్సాహం లభిస్తుందని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ వేదికగా 2027లో జరిగే ఆసియా కరాటే పోటీలను నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలనే ఏకైక లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ముందడుగు వేస్తుందన్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 4వ కియో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోటీలలో రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి.పొన్నం ప్రభాకర్, శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్, TSKDA అధ్యక్షులు, పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథోరిటీ చైర్మన్ శివసేన రెడ్డి, కియో అధ్యక్షులు భరత్ శర్మ, వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బాక్సర్ నిఖత్ జరీన్, ఓబీసీ దేవేలెప్మెంట్ చైర్మన్ జేరిపేటి జైపాల్, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ లతో కలిసి జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత స్పోర్ట్స్ ను ప్రోత్సహించే విధంగా మండల స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయిలో క్రీడలను నిర్వహించడం జరుగుతుందని, క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని శాసనస సభాపతి గడ్డం ప్రసాద్ తెలిపారు. క్రీడల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా ప్రోత్సహిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలు అందిస్తుందని, గడిచిన 10సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంతటి గొప్ప పోటీలు నిర్వహించుకోకపోవడం చాలా శోచనీయమన్నారు. దేశవ్యాప్తంగానే క్రీడలన్నింటికీ తెలంగాణ రాష్ట్రం సెంటర్ పాయింట్‌గా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడలను నిర్వహించడం చాలా గొప్ప విషయమని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి హైదరాబాద్ వేదికగా 2027లో జరిగే ఆసియా కరాటే పోటీలను నిర్వహించేందుకు కృషి చేస్తామని అందుకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయాలని తెలిపారని తెలంగాణ రాష్ట్ర కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో 29 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు నుండి 1500 మంది క్రీడాకారులతో ఘనంగా ఈ కరాటే పోటీలను నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. ఈ పోటీల ద్వారా మన అథ్లెట్ల అంకితభావం, నైపుణ్యాన్ని భారత్ దేశం అంతటా కరాటే సమాజాన్ని బలోపేతం చేస్తుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి క్రీడాకారులకు చాలా ప్రోత్సాహం అందిస్తున్నారని, కరాటే పోటీలను ఇంత గొప్పగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ బాక్సర్ నిఖత్ జరీన్ అన్నారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కో ఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, గచ్చిబౌలి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భరత్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సౌందర్య రాజన్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నితిన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.